బిహెచ్ఈ ఎల్ లో శ్రీశ్రీశ్రీ గణపతి రాజరాజేశ్వరీ జయలక్ష్మి మాత దత్తాత్రేయ సహిత శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కుంబాభిషేకం

Share this:

పటాన్ చెరు(V3News) 16-04-2022: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోని రామచంద్రాపురం ఎల్ఐజీ లో శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి అమృత హస్తాలతో నిర్మింబడిన శ్రీశ్రీశ్రీ గణపతి రాజరాజేశ్వరీ జయలక్ష్మి మాత దత్తాత్రేయ సహిత శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ,కుంబాభిషేకం కార్యక్రమాలు శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆధ్వర్యంలో జరిగాయి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి శ్రీశ్రీశ్రీ గణపతి రాజరాజేశ్వరీ జయలక్ష్మి మాత దత్తాత్రేయ సహిత శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన, కుంభాబిషేకం కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. రాష్ట్ర మంత్రి సిహెచ్ మల్లారెడ్డి,‌స్ధానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ మీడియాతో మాట్లాడుతూ.. లోక కళ్యాణార్ధం హనుమాన్ చాలీసా పారాయణము, కుంభాభిషేకం కార్యక్రమాలు నిర్వహించటం జరిగిందన్నారు. హిందూ దేశంతో పాటు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు సుఖ శాంతులతో శోభిల్లాలని ఆయన ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో స్ధానిక ప్రముఖులు,కార్పోరేటర్లు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

Leave a Reply