పాలు, పాల ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడాన్ని నిరసిస్తూ టిఆర్ఎస్ పార్టీ ఆందోళన… పాల్గొన్న ఎమ్మెల్యే అరూరి

Share this:

పాలు, పాల ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడాన్ని నిరసిస్తూ టీఆరెఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారి ఆధ్వర్యంలో వర్దన్నపేట మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ వద్ద టీఆరెఎస్ పార్టీ శ్రేణులు, రైతులు రోడ్డుపై బైటాయించి పాల డబ్బాలతో నిరసన తెలుపుతూ ధర్నా చేపట్టారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు దేశ రైతులపైన, దేశంలోని సామాన్య పేద మధ్యతరగతి ప్రజలపైన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విషం చీమ్ముతోందని మండిపడ్డారు. నేడు భారత దేశంలో సగటు మనిషి బ్రతకలేని స్థితికి బీజేపీ తీసుకువచ్చిందని ఆరోపించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారి పాలు, పాల ఉత్పత్తులపై జీఎస్టీ పన్ను విధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరలు పెంచిన బీజేపీ ప్రభుత్వం పాలు, పాల ఉత్పత్తులపై జీఎస్టీ విధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు, రైతులు పోరాటం చేయాలనీ పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతేనే దేశానికి, దేశ ప్రజలకు విముక్తి కలుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో వర్దన్నపేట మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply