బాబు జగ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాల కోసం పోరాడరు. -బీజేపీ బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ రాజేశ్వర్

Share this:

భీమ్‌గల్(V3News)05-04-2022: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ పట్టణంలోని మంగళవారం జగ్జీవన్ రామ్ 115వ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ రాజేశ్వర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్రం సమరయోధుడు గొప్ప సంఘ కార్యకర్త భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతిని భీమ్‌గల్ పట్టణంలో భారతీయ జనతాపార్టీ భీమ్‌గల్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బిజెపి బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ రూయ్యడి రాజేశ్వర్ హాజరు కావడం జరిగింది. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలవేసి ఆయనను స్మరించుకున్నారు,
రుయ్యడి రాజేశ్వర్, మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాల కోసం పోరాడారని, బిజెపి సిద్ధాంతమైన అట్టడుగు వర్గాలకు కూడా ప్రభుత్వ పథకాలు అందాలని,బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం బిజెపి తో కలిసి బాబు జగ్జీవన్ రామ్ పని చేశారని గుర్తు చేశారు. కార్యకర్తలు ఆయన ఆలోచనలను,గుర్తు చేసుకోవాలని, ఆయన బాటలో నడవాలని,రాజేశ్వరి కార్యకర్తలకు సూచించారు,ఈ కార్యక్రమంలో భీంగల్ పట్టణ అధ్యక్షులు చిన్ని నరసయ్య, యోగేశ్వర నర్సయ్య, సంధ్య రాజు, బాబురావు, మధు, చైతన్య, నాగార్జున రెడ్డి,కోట్లల అశోక్, నవతేజ్, లక్ష్మణ్, వెంకటేష్ ఉదయ్, రంజిత్, అనుప్, సుమన్,లక్ష్మీ నరసయ్య, నవీన్, లింబాద్రి, లక్ష్మణ్ గౌడ్, నవిన్, నరేష్, లక్ష్మీనారాయణ, మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply