అగ్నిమాపక వారోత్సవాల్లో పాల్గొన్న ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్

Share this:

సూర్యాపేట తేదీ 15-4-22: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఫైర్‌ స్టేషన్‌లో శుక్రవారం అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ముఖ్య అతిథిగా ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ గారు హాజరై స్థానిక 27 వార్డ్ కౌన్సిలర్ చిరివేళ్ల లక్ష్మీ కాంతమ్మ గారితో కలిసి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు.జిల్లా అగ్ని మాపక అధికారి ఎస్సై సిహెచ్ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో అగ్ని భద్రత-ఉత్పాదకత అనే అంశంతో ప్రజలకు ఎంపీ బడుగుల అవగాహన కల్పించారు.అనంతరం ఎంపీ నిధుల నుండి ఫైర్ స్టేషన్ లో నూతన గదుల నిర్మాణానికి 5 లక్షలు మంజూరు చేయించారు. మా అవసరాన్ని గుర్తించి నిర్మాణానికి కావాల్సిన నిధులను సహకరించిన ఎంపీ బడుగుల గారికి మరియు మంత్రి జగదీష్ రెడ్డి గారికి ఫైర్ స్టేషన్ సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫైర్‌స్టేషన్‌ లీడింగ్‌ అధికారులు డి.శంకర్,సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply