బండారిగూడెం పాఠశాల ఆకర్షణీయం అందరికీ ఆదర్శం…

Share this:

మారుమూల గిరిజన గ్రామం లోని బండారిగూడెం ప్రాథమికోన్నత పాఠశాల ఎంతో ఆకర్షణీయంగా ఉందని అది అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని ఐటీసీ పీఎస్పీడీ సారపాకకు చెందిన భద్రాచలం మహిళాసమితి అధ్యక్షురాలు టి.సునీత మహంతి అన్నారు.శుక్రవారం నాడు భద్రాచలం మహిళా సమితి సభ్యులు ఐటీసీ ఎమ్మెస్కే మరియు వాష్ ఐ బృందంతో పాఠశాలను సందర్శించారు.ఈ సందర్భంగా పాఠశాల విద్యా కమిటీ చైర్మెన్ కుంజా నాగేశ్వరరావు మాట్లాడుతూ తమ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు బెక్కంటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యా కమిటీ సభ్యులు , ఉపాధ్యాయులు,గ్రామస్తులు, స్వచ్ఛంద సేవా సంస్థల కృషి అభినందనీయమని స్వచ్ఛ విద్యాలయ పురస్కారానికి జాతీయస్థాయిలో మా పాఠశాల నామినేట్ కావటం నాకెంతో ఆనందం కలిగిస్తుందని అన్నారు.

బీఎంఎస్ ప్రధానకార్యదర్శి రేష్మ మాట్లాడుతూ ఈ పాఠశాలను పిల్లలను చూస్తుంటే ఎంతో ఆనందం కలుగుతుందని ఏదైనా పాఠశాలలకు చెయ్యాలి అనే ఆకాంక్ష కలుగుతుందని వారు అన్నారు.ఐటీసీ ఎమ్మెస్కే పోగ్రామ్ మేనేజర్ జయ ప్రకాశ్ మాట్లాడుతూ ఐటీసీ చేసే సేవా కార్యక్రమాలు ప్రజలకు అందడం మంచి ఫలితాలు రావడం తనకెంతో ఆనందం కలిగిస్తుందని దానికి ఉదాహరణగా బండారిగూడెం పాఠశాల రాష్ట్ర స్థాయిలో నిలిచిందని అన్నారు.

ఐటీసీ ఎమ్మెస్కే ప్రోగ్రామ్ ఆఫీసర్ కె కృష్ణ మాట్లాడుతూ పాఠశాల చూస్తుంటే తిరిగి తాను కూడా మరొక్కసారి విద్యార్థిగా మారి ఈ పాఠశాలల్లో చదువుకోవాలి అనిపిస్తోందని అన్నారు. ప్రధానోపాధ్యాయుడు బెక్కంటి శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ పాఠశాలకు ఇంతమంది రావటం విద్యార్థులతో ముచ్చటించటం తన తనకు ఎంతో ఆనందం కలుగుతుందని,పాఠశాల అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరించిన సర్పంచ్ కాటిపోయిన వెంకటేశ్వర్లకు, విద్యా కమిటీ చైర్మెన్ కుంజా నాగేశ్వరరావుకు, ఐటీసీ బంగారు భవిష్యత్ వాష్ ప్రోగ్రాం వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి ఎం ఎస్ అడ్వైజరీ కమిటీ తనుశ్రీ ఘోష్, జాయింట్ సెక్రటరీ మాధవి తో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బెక్కంటి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు ఏబీ సీతారాం, టి.వంశీమోహన్, బి.సరోజిని తోపాటు ఎం ఎస్ కె వాష్ ప్రోగ్రామ్ సీవో సందీప్ తో పాటు ఆయా తిరుపతమ్మ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు .