బసవేశ్వరుని జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ

Share this:

పెద్దపల్లి జిల్లా (V3News) 04-05-2022: బసవేశ్వరుని జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ మరియు పెద్దపల్లి డిసిపి రవీందర్. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ హైందవ మతాన్ని సంస్కరించిన ప్రముఖులలో బసవేశ్వరుడు ఒక్కరని, ప్రజలంతా విశ్వగురువు అని పిలుస్తారని అదనపు కలెక్టర్ తెలిపారు. బసవేశ్వరుడు కుల వ్యవస్థ వర్ణ బేధం లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించారని అన్నారు.రాజ్య పాలనను ముఖ్య పాత్ర పోషిస్తూ వచ్చిన సాహిత్యంలో ప్రజలందరినీ కులమతాలకతీతంగా ఏకం చేశారని తెలిపారు. అలాంటి మహనీయుని జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని, మహనీయుని బోధనలు ప్రజలంతా పాటించాలని మంచి మార్గంలో నడవాలని అదనపు కలెక్టర్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లో డి.సి.పి. రవీందర్, డి.ఆర్.డి. ఓ.శ్రీధర్, కలెక్టరేట్ సూపరెండెంట్ తూము రవీందర్, కలెక్టరేట్ సిబ్బంది,సంబంధిత అధికారులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply