పువ్వులను పూజించే గొప్ప పండగ బతుకమ్మ…

Share this:

  • మన పండగ.. మన సంస్కృతి.. మన సాంప్రదాయానికి ప్రతీక…
  • ఆడపడుచుల ఔన్నత్యానికి సూచిక…

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల‌కు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక అయిన‌ బతుకమ్మ పండుగను జిల్లా ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని గౌరవ జిల్లా గ్రంధాలయ చైర్మన్ రాజు గౌడ్(సుశీల్ కుమార్ గౌడ్) గారు పేర్కొన్నారు. నేటి నుండి బతుకమ్మ పండుగ ప్రారంభం సందర్భంగా జిల్లా ప్రజలకు, ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎంగిలిపూలను వెదజల్లుకొనే అమావాస్య నుంచి తొమ్మిది రోజులపాటు అడబిడ్డ‌లు అంద‌రూ క‌లిసి తీరొక్క పూలు.. తీరొక్క రంగులతో ఆడుకునే గొప్ప‌ పండగ బతుకమ్మ అని గౌరవ జిల్లా గ్రంధాలయ చైర్మన్ చెప్పారు. దేశంలో పూలను పూజించి, ప్రకృతి ని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని ఇలాంటి సంస్కృతి మన తెలంగాణలో ఉందని టీఆర్ఎస్ ప్రభుత్వం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నామ‌ని, రాష్ట్ర పండుగగా గుర్తించామ‌ని చెప్పారు. ప్రతి ఏటా బతుకమ్మ కానుకగా ఆడపడుచులకు చీరలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ పండుగను ప్రజలందరు వేడుకగా, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.