మానవ సంబంధాలను పటిష్టం చేసేలా బతుకమ్మ-సీతక్క

Share this:

ములుగు(V3News ) 30-09-2022: మానవ సంబంధాలను పటిష్టం చేసేలా బతుకమ్మ పండుగ నిర్వహిస్తారని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థినిలకు, కాసం పుల్లయ్య వస్త్ర సంస్థ అధినేత నమశ్శివాయ అందించిన లక్ష రూపాయలు విలువగల దుస్తులను ప్రిన్సిపాల్‌ ఆస్నాల శ్రీనివాస్‌ అధ్యక్షతన ములుగు ఎమ్మెల్యే సీతక్క విద్యార్థినిలకు అందచేశారు. అనంతరం విద్యార్థినిలు, అధ్యాపకులతో కలిసి బతుకమ్మ సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ సంస్కతి సాంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ పండుగను అభివర్ణించారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలను చేత పట్టుకుని విద్యార్థినిలు బతుకమ్మ ఆట ఆడారు.
కళాశాల అభివద్ధి కోసం నిరంతర అన్వేషణలో ప్రిన్సిపాల్‌ అస్నాల శ్రీనివాస్‌ ఉంటున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రిన్సిపాల్‌ ను కొనియాడారు.పేద విద్యార్థినిలకు బతుకమ్మ డ్రెస్‌ల పంపిణీ చేపట్టిన ఘనత వారిదేనని అన్నారు.ప్రిన్సిపాల్‌ ప్రాతినిధ్యాలతో తాను ఎంపీసీ కోర్స్‌ ఏర్పాటుతో పాటు అనేక మౌలిక సౌకర్యాలు కల్పన జరిగిందన్నారు.త్వరలో టూరిజం కోర్స్‌ మంజూరు కోసం ప్రయత్నం చేస్తానని అన్నారు.ప్రముఖ సంఘ సేవకుడు డాక్టర్‌ తుమ్మ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఇక్కడి విద్యార్థుల ఉన్నత విద్యకు కావాల్సిన సహాయాన్ని అందిస్తామని తెలిపారు. విద్యార్థులకు నోట్‌ బుక్స్‌ అందచేశారు.ప్రిన్సిపాల్‌ ఆస్నాల శ్రీనివాస్‌ మాట్లాడుతూ అధ్యాపకులు ప్రజాప్రతినిధులు అధికారులు సామాజిక సేవ సంస్థల తోడ్పాటుతో కళాశాల చక్కటి ఫలితాలను సాధిస్తున్నదని తెలిపారు.కార్యక్రమంలో సర్పంచ్‌ ఇర్ప సునీల్‌ దొర, అధ్యాపకులు రాములు, నాయక్‌,సంధ్య,శ్వేత, మూర్తి,రాజు,అశోక్‌,రాజ్‌ కుమార్‌,భిక్షం,నాగరాజు, సుశీల్‌ విద్యార్థులు పాల్గొన్నారు.