తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభం అయిన ఇంటర్ పరీక్షలు

Share this:

రామగుండం(V3News) 06-05-2022: తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు విద్యార్థులు సకాలంలో హాజరయ్యారు. నియోజకవర్గంలో ఏడు సెంటర్లలో రెండు వేల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. నిమిషం నిబంధన అమలులో ఉండడంతో విద్యార్థులు అరగంట ముందు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. సిసి కెమెరాల పర్యవేక్షణలో ప్రశ్నాపత్రాలను తెరిచి పరీక్షలను మొదలుపెట్టారు. ఎగ్జామ్ సెంటర్లోకీ ఎలక్ట్రానిక్ పరికరాలను నిషేధించడంతో విద్యార్థులు అప్రమత్తమయ్యారు. కోవిడ్ లక్షణాలు ఉన్న విద్యార్థులకు ప్రత్యేక గదుల్లో పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్ష నిర్వాహకులు, ఇన్విజిలేటర్లు తగిన చర్యలు చేపట్టారు. ప్రశాంత వాతావరణంలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమవగా… విద్యార్థులు ఒత్తిడికి లోనవ్వకుండా పరీక్షలు రాసే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు.

Leave a Reply