డీఎస్పీ కార్యాలయం ముందు బీజేపీ నాయకుల ధర్నా

Share this:

దేవరకొండ(V3News) 14-07-2022: దేవరకొండ బీజేపీ మండల నాయకునిపై డీఎస్పీ నాగేశ్వరరావు దాడి చేసాడని ఆరోపిస్తూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో దేవరకొండ డీఎస్పీ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు ధర్నాకు దిగారు…ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ ఫిర్యాదు చేయడానికి దేవరకొండ డీఎస్పీ ఆఫీస్ కు వెళ్లిన బీజేపీ మండల నాయకునిపై ఇష్టానుసారంగా డిఎస్పీ దాడి చేయడమే కాకుండా అతనిపై రివర్స్ కేసు నమోదు చేయడం దారుణమని మండిపడ్డారు.

బీజేపీ మండల నాయకుడిపై దాడిని వైఖరిని ఖండిస్తూ ఈరోజు దేవరకొండ డిఎస్పీ కార్యాలయం ముందు ఈరోజు ధర్నా నిర్వహించిన బీజేపీ నేతలు మాట్లాడుతూ అధికార పార్టీకి ఏజెంట్ గా మారి,మునుగోడు ప్రాంతంలో నిర్మించే ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు తొత్తుగా పని చేస్తూ,నిర్వాసితులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు…మునుగోడు నియోజకవర్గ పరిధిలోని నాంపల్లి మండలానికి చెందిన బీజేపీ కార్యకర్త ఫిర్యాదు చేయడానికి డిఎస్పీ ఆఫీస్ కు వెళితే అతనిపై అకారణంగా దాడి చేశారని,విషయం తెలుసుకుని తాము చెప్పినా వినకుండా బీజేపీ నాయకుడి పట్ల కక్ష పూరితంగా వ్యవహరించిన దేవరకొండ డిఎస్పీ నాగేశ్వరరావుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.బీజేపీ ధర్నాకు పిలువునివ్వడంతో సమాధానం చెప్పే ధైర్యం లేక, సెలవు పెట్టి ముఖం చాటేసిన డిఎస్పీని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలేది లేదని,ఈ అక్రమాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

Leave a Reply