షాద్ నగర్ లో బిజెపి జెండా ఎగురవేస్తాం

Share this:

గడిల పాలనకు అడ్డుకట్ట బీజేపీతోనే సాధ్యం
పాలమూరు విష్ణు వర్ధన్ రెడ్డి(పి వి ఆర్)ఆధ్వర్యంలో భారీగా తరలిన బిజెపి శ్రేణులు.

షాద్ నగర్(v3News) 06-05-2022: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది బిజెపి ప్రభుత్వం అని,అందుకోసం రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శ్రీకారం చుట్టారని ఆశాభావం వ్యక్తం చేశారు నియోజకవర్గ ఇంచార్జీ శ్రీవర్ధన్ రెడ్డి, పాలమూరు విష్ణు వర్ధన్ రెడ్డి.”జనం గోస-బీజేపీ భరోసా”పేరుతో ప్రారంభించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రను జానం పేట దేవాలయం వద్ద యాత్రకు బయలుదేరాడానికి శ్రీకారం చుట్టారు.ఇందులో భాగంగా ముందుగా పాలమూరు విష్ణు వర్ధన్ రెడ్డి(పి వి ఆర్)తో కలసి ర్యాలీని ప్రారంభించారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో గడిలా పాలన నడుస్తుందని ఆరోపించారు.బండి సంజయ్ యాత్రతో తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయాలకు తెరలేపనున్నట్లు తెలిపారు.గతంలో కుటుంబ పాలన అని చిలకపలుకులు పలికిన కేసీఆర్, నేడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటని సూటిగా ప్రశ్నించారు కుటుంబ పాలనకు తెరపడే పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు.ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పై బీజేపీ నాయకుడు సంజయ్ రాకతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు అందే బాబయ్య ముదిరాజ్, బీజేవైఎమ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వంశీకృష్ణ,పట్టణ అధ్యక్షుడు రుషికేశ్,రంగారెడ్డి జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి కక్కునూరు వెంకటేష్ గుప్తా, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మల్చలం మురళీ,మండలాలకు చెందిన అధ్యక్షులు,కార్యదర్శులు,నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు.

Leave a Reply