బీజేపీ అంటేనే బుద్ది,జ్ఞానం లేని పార్టీ

Share this:

 • సంజయ్, అరవింద్ లు అచ్చేసిన ఆంబోతులు
 • -ఒకడు తిరుగుబోతు, ఇంకొకడు వాగుబోతు
 • -చదువు సంజ్ఞ లేని సంస్కార హీనులు
 • ఫ్రాడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాగా ఎఫ్ సీఐ
 • -మోడీది “ఈడీయిజం”
 • -కేసీఆర్ ది “తెలంగాణ యిజం”
 • -గుజరాత్ లో కరెంటు కోతలు
 • -తెలంగాణ లో వరి కోతలు
 • -వడ్లు కొనే వరకూ వదిలేది లేదు
 • -మోడీకి మూడింది
 • -నూకలు తినమన్నోడి పీక పట్టుకుంటాం
 • -కదం తొక్కుతాం- మదం దింపుతాం
 • -బీజేపీ దొంగలపై రైతుల దంగల్
 • ఆర్మూర్ రైతులది వినూత్న నిరసన
 • -ఎంపీ అరవింద్ రైతుల కోపాగ్ని నుంచి తప్పించుకోలేడు
 • -నిప్పులు చెరిగిన పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్12:-బీజేపీ అంటేనే బుద్ది,జ్ఞానం లేని పార్టీగా మారి దేశాన్ని సర్వనాశనం చేస్తున్నదని పీయూసీ చైర్మన్,ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి మండి పడ్డారు. టీఆర్ ఎస్ ఎల్ పీ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ఎంపీలు బండి సంజయ్, అరవింద్ లు అచ్చేసిన ఆంబోతుల్లా వ్యవరిస్తూ నోటికొచ్చినట్టు వాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. “బండి సంజయ్ తిరుగుబోతు. అరవింద్ వాగుబోతు,చదువు సంజ్ఞ లేని సంస్కార హీనులు. ఏ విషయం లోనూ పరిజ్ఞానం లేని చిల్లరగాళ్ళు. వాట్సాప్ యూనివర్సిటీ లో నేర్చుకున్న అబద్దాలతో బతుకుతున్నారు. ఢిల్లీలో ధర్నా తర్వాత బీజేపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. సీఎం కేసీఆర్ ను దుర్బాషలాడుతున్నారు. ఈ ఇద్దరు కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు. ఈ బట్టేబజ్ గాళ్లతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు.
గోధుమలు, వడ్లకు తేడా తెలియని సన్నాసులు బీజేపీ నేతలు” అని ఆయన ధ్వజమెత్తారు. రైతుల కోసం 24 గంటలు తపించే వ్యక్తి కేసీఆర్ అని, స్వయంగా రైతు అయిన ఆయన వ్యవసాయ రంగానికి ఇప్పటికే మూడున్నర లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రైతుల బతుకుల్లో వెలుగులు నింపారని జీవన్ రెడ్డి తెలిపారు. అలాంటి రైతు బంధు కేసీఆర్ ను అసభ్యకరమైన భాషతో దూషిస్తున్నవారిని వడలబోమని, బట్టలూడదీసి ఉరికిచ్చి కొడతామని ఆయన హెచ్చరించారు. రైతులు కడుపు మండి నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇంటి ముందు వడ్లు కుప్పలు గా పోసి నిరసన చాటారు .రైతు ఉద్యమం ఏదైనా ఆర్మూర్ నుంచి ప్రారంభమవుతుందన్నారు. రైతులు కడుపు మండి నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇంటి ముందు వడ్లు కుప్పలుగా పోసి నిరసన చాటారన్నారు.బీజేపీ దొంగల పై రైతులు దంగల్ ప్రకటించారన్నారు. “రైతులు కదం తొక్కారు. బీజేపీ నేతల మదం దింపుతారు. బీజేపీ ని బొంద పెట్టేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు.నిజామాబాద్ ఎంపీ అరవింద్ రైతు ద్రోహి. రైతులను మోసాగించాడు. తాను గెలిస్తే అయిదు రోజుల్లోగా పసుపు బోర్డు తెస్తానని, లేకుంటే ఎంపీ పదవికి రాజీనామా చేసి రైతు ఉద్యమం లో పాల్గొంటానని బాండ్ పేపర్ రాసిచ్చాడు. దానిని ఎక్కడ దాచి పెట్టాడు.

పసుపు బోర్డు తెచ్చే బాధ్యత అరవింద్ దే
ఢిల్లీ పెద్దల భజన ఆపి తెలంగాణ సోయిలోకి రా. రైతుల పక్షాన నిలువు. అరవింద్ రైతుల కోపాగ్ని నుంచి తప్పించుకోలేడు. రైతుల ఉద్యమానికి రైతులు దిగొచ్చి కేంద్రం వడ్లు కొనేవరకు వదిలేది లేదు. రైతులతో పెట్టుకున్నోళ్లెవరూ బాగుపడలే. ఆర్మూర్ లో కాంగ్రెస్, బషీర్ బాగ్ లో చంద్రబాబు నాయుడు రైతులను కాల్చి చంపి ఫలితం అనుభవిస్తున్నారు. రైతుల ఉసురు పోసుకున్న బీజేపీ పంజాబ్ లో మట్టి కొట్టుకుపోయింది. మోడీకి రైతుల ఉసురు కొడుతుంది అని జీవన్ రెడ్డి అన్నారు. ఈడీ, ఐటీ, సీబీఐల మాదిరిగానే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఫ్రాడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాగా మార్చి కేంద్రం తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోంది. ప్రధానిమోడీది “ఈడీయిజం”.సీఎం కేసీఆర్ ది “తెలంగాణ యిజం”. గుజరాత్ లో కరెంటు కోతలు ఉంటే పచ్చదనపు తెలంగాణ లో వరి కోతలు ఉన్నాయి. రైతులతో పెట్టుకున్న మోడీకి మూడింది. నూకలు తినమన్నోడి పీక పట్టుకుంటాం అని ఆయన తీవ్ర స్వరంతో అన్నారు. కేసీఆర్ పెట్టిన డెడ్ లైన్ ను పాటించి కేంద్రం ధాన్యం కొను గోలు చేయాలన్నారు. లేకుంటే కేంద్ర ప్రభుత్వంతో యుద్ధమేనని జీవన్ రెడ్డి హెచ్చరించారు.

Leave a Reply