తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వాన్ని తేవడమే తమ ముందున్న లక్ష్యం- బిజెపి జాతీయ నాయకుడు మురళిధర రావు

Share this:

కుత్బుల్లాపూర్‌, గాజులరామారాంలోని “సత్యగౌరి కన్వెన్షన్ హల్” లో బిజెపి జాతీయ నాయకులు మరియి తెలంగాణలో నివసిస్తున్న బీహర్, జార్ఖండ్ రాష్ట్రల కార్యకర్తలతో “కమ్యునిటి మీట్ & గ్రీట్” సమ్మేళన కార్యక్రమం కుత్బుల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే & బిజెపి రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహయ మంత్రి నిత్యానంద రాయి, బీహర్ రాష్ట్ర డిప్యుటీ సిఎమ్ రేణుదేవి, కేంద్ర మాజీ మంత్రి & బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు రాధమోహన్ సింగ్, ఎంపి మనోజ్ తివారి, బిజెపి జాతీయ నాయకులు మురళిధర రావు తదితరులు హజరైయ్యారు. ఈ సందర్బంగా బిజెపి జాతీయ నాయకుడు మురళిధరరావు మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తుందని, ఈ పాలనను అంతమొందించేందుకు రాష్ట్ర ప్రజలు సిద్దంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోడీ చేసే అభివృద్ధి పనులకు ఆకర్శితులై రాష్టంలో బిజెపి ప్రభుత్వం తేవడానికి ఇక్కడి ప్రజలు సిద్దంగా ఉన్నారని, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి జాతీయ స్దాయి నాయకులు వెళ్ళి కేంద్రంలో బిజెపి పాలనపై ప్రజలకు అవగాహన కల్పించి రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం రావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవనీతిపై ప్రజలను చైతన్య పరుస్తూ క్షేత్ర స్దాయి నుండి బిజెపిని బలోపేతం చేయడమే ఈ సమ్మెళన ముఖ్య ఉద్దేశం అని తెలిపారు.

Leave a Reply