Epitome సంస్థ పై కొందరు కావాల్సికొని బురద జల్లుతున్నారు- Epitome సంస్థ డైరెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి

Share this:

చౌటుప్పల్(V3News) 25-06-2022: Epitome సంస్థ పై కొందరు కావాల్సికొని బురద జల్లుతున్నారని, Epitome సంస్థ ఉద్యోగులు ఎవరి పై తుపాకులు గురిపెట్టి బెదిరింపులకు గురి చేయలేదని,రైతుల పట్టా భూములు, అసైండ్ భూములను కబ్జా చేయలేదని చౌటుప్పల్ RDO సూరజ్ కుమార్ కి వివరణ ఇస్తూ లేఖ ను అందజేసిన Epitome సంస్థ డైరెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి,గ్రామ రైతులు కొండూరు వెంకన్న,శ్యామ్ పాల్గొన్నారు

Epitome సంస్థ డైరెక్టర్ మాట్లాడుతూ : Epitome సంస్థ వలన చౌటుప్పల్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అన్నిటికి రెవిన్యూ సమకూరుతుందని ఎక్కడలేని విధంగా HMDA అనుమతులు తీసుకొని విశాలమైన రోడ్లు, పలు గ్రామాలకు లింకు చేస్తూ లింకు రోడ్లు వేసి అభివృద్ధి చేసి ఇస్తున్నామని కొందరు కావాల్సి Epitome సంస్థపై బురద జల్లాలని చూస్తున్నారని 365 ఎకరాల్లో చేస్తున్న ఈ వెంచర్ మొత్తం భూమి రైతుల వద్ద కొనుగోలు చేసినదేనని తంగళ్ళపల్లి గ్రామ రైతులు ఆరోపిస్తున్నట్లు వారి భూములను ఎక్కడ కబ్జా చేయలేదని,వారికి అనుమానం ఉంటే ప్రభుత్వానికి టీ పన్ను కట్టి సర్వేయర్ తో సర్వే చేయించుకోవచ్చని, మా సంస్థల యొక్క రైతు నష్టపోకూడదనే వారి యొక్క గుండె భూమి ఉన్నది అని నేను తిరిగి ఇస్తామని అలాగే ఇటువంటి పెద్ద సంస్థలు రావడంతో చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న యువతకు ఉపాధి కలుగుతుందని తెలిపారు

కొండూరు వెంకన్న రైతు మాట్లాడుతూ : తంగళ్ళపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కొంతమంది రైతులని తప్పుదోవ పట్టిస్తూ తమ భూములను కబ్జా చేశారని సంస్థ మీదకి తీసుకు వస్తున్నారని గతంలో తాను చేసిన వెంచర్ లే నాల కబ్జా చేసి వెంచర్ చేశాడని,సంస్థ ద్వారా మా రైతులు ఎవరు నష్ట పోలేదని,సంస్థ వలన గ్రామంలో వున్నవారికి ఉపాధి దొరుకుతుందని ఈటువంటి సంస్థలను స్వాగతించాలి తెలిపారు

Leave a Reply