ప్రైవేటు పాటశాల ల్లో నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు అమ్మకాలపై చర్యలు తీసుకోవాలి

Share this:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం: 14/6/2022 :కరోనా కారణంగా 2 సంవత్సరాల నుంచి వ్యాపారం సాగక బుక్ షాపుల వ్యాపారస్తులు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని భద్రాచలం బుక్ షాప్ అసోసియేషన్ నిర్వాహకులు పేర్కొన్నారు.

ఈ ఏడాది పూర్తి స్థాయిలో పాటశాలలు తెరచిన నేపథ్యంలో. ప్రైవేటు పాటశాలల నిర్వహుకులు వారే నేరుగా నోట్ బుక్స్ అమ్మకాలు జరుపుతున్నారని అన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా నోట్ బుక్స్ అమ్మకాలు జరుపుతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని
స్థానిక ఎం ఈ వో సమ్మయ్య కు, చాంబర్ ఆఫ్ కామర్స్ కు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాలు అమ్మకాలు జరుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బుక్ షాప్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు

Leave a Reply