బోర్వెల్ వాహనం, లారీ డీ

Share this:

సూర్యాపేట (v3 news) 16-04-2022: సూర్యాపేట పట్టణంలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.ఖమ్మం రోడ్డులోని మూసీ కాల్వ మలుపు వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్గొండకు చెందిన బోర్వెల్ డ్రైవర్ శ్రీని వాస్ తీవ్రంగా గాయపడ్డారు.ఇల్లందు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న బోర్వెల్ లారీని సూర్యాపేట లోని మూసీ కాలవ రోడ్డు నుంచి ఖమ్మం రహదారి పైకి వెళ్లే మలుపులో మరో లారీ ఎదురుగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బోర్వెల్ లారీ నడుపుతున్న డ్రైవర్ శ్రీనివాస్ మధ్యలో ఇరుక్కుపోయాడు. లారీ క్లీనర్ స్వల్పంగా గాయాలపాలయ్యాడు సమాచారం అందుకున్న సూర్యాపేట సిఐ ఆంజనేయులు,చివ్వెంల ఎస్సై విష్ణు తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు వెంటనే సహాయక చర్యలు చేపట్టి,గ్యాస్ కట్టర్ సహాయంతో స్థానికులు,పోలీసులు గంటపాటు శ్రమించి శ్రీనివాస్ ను సురక్షితంగా బయటకు తీశారు.కాగా ఖమ్మం రహదారికి రెండువైపులా భారీగా ట్రాఫికకు త్రివ అంతరాయం ఏర్పడింది.

Leave a Reply