రైతుల కోసం బిఎస్పీ ఉద్యమం

Share this:

నకిరేకల్(V3News) 12-04-2022: రైతులను నట్టేట ముంచిన ఘనత కేసీఆర్ కె దక్కుతుందన్నారు. యసంగి ధాన్యం సేకరించబోమంటూ చెప్పడం రైతులను రాజకీయంగా వాడుకోవడమేనని మండిపడ్డారు.ధాన్యం పండించే రైతులకు అండగా తాము ఉంటామని నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి స్పష్టం చేశారు.బిఎస్పీ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేశారు.అనంతరం మాట్లాడుతూ యసంగి ధాన్యం సేకరించకుండ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ రైతులను మోసం చేస్తూన్నాయని అన్నారు. అధికారంలో ఉండి వడ్లు కొనకుండా ధర్నాలు చేయడం రైతులను రాజకీయంగా వాడుకోవడమేనని మండిపడ్డారు.ధాన్యం పండించే రైతులకు అండగా తాము ఉంటామని నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి స్పష్టం చేశారు.బిఎస్పీ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేసి వినతి పత్రం అందజేశారు.అనంతరం మాట్లాడుతూ యసంగిలో వడ్లు కొనమని చెప్పడంతో ఈ సారి రాష్టంలో కేవలం 35 లక్షల ఎకరాలకు పరిమితమైందని ఆరోపించారు.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే ఛాన్స్ ఉందన్నారు. ఈ రోజు వరకు యాక్షన్ ప్లాన్ రూపొందించకపోవడం దారుణమన్నారు.ప్రభుత్వం చేతులెత్తేయడంతో రైతుల పరిస్థితి రెంటికి చెడ్డ రెవడి అన్న చందంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఎలాంటి అన్యాయం జరిగినా తాము ఉరుకోబోమంటూ హెచ్చరించారు.రాబోయే కాలంలో వారి పక్షాన ఉంటూ పోరాడుతామని చెప్పారు.

Leave a Reply