పుష్కరాలకు బస్సులు లేవా !

Share this:

  • సూపర్ లగ్జరీ బస్సులు కావాలంటే కోదాడ, నల్లగొండ మిర్యాలగూడ నుండి తీసుకోవాల్సిందేనా !
  • భక్తులపై అదనపు భారం తప్పదా !
  • ప్రైవేటు వాహనాల పై ఆధారపడాల్సిందే నా !
  • ఆర్టీసీకి ఆదాయం వద్దా ఇది ఎవరి లోపం !

సూర్యాపేట(V3News) 12-04-2022: ఈనెల 13 నుండి 24 వరకు ప్రాణహిత పుష్కరాలు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం లో జరుగుతున్న విషయం విదితమే.ఎక్కువగా పుష్కరాలకు వయసు మళ్ళిన వాళ్ళు వెళుతుంటారు. ప్రయాణం సాఫీగా సాగాలంటే సూపర్ లగ్జరీ బస్సులు పుష్ బ్యాక్ తో కొంచెం అనువుగా ఉంటాయి. కానీ సూర్యాపేట నుండి కాళేశ్వరం వెళ్లాలంటే సూర్యాపేట డిపో లో సూపర్ లగ్జరీ బస్సులు లేవు. కావాలంటే మిర్యాలగూడెం కోదాడ నల్గొండ నుండి తెచ్చుకోవాల్సిందే అంటున్నారు.ఆర్టీసీ అధికారులు.దీంతో భక్తులకు అదనపు భారం తప్పడం లేదు. సూర్యాపేట నుండి సూపర్ లగ్జరీ బస్సులు లేక పోవడం తో భక్తులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించడం తప్పడం లేదు. భక్తుల సౌకర్యార్థం మంత్రి జగదీష్ రెడ్డి చొరవ తీసుకొని పుష్కరాలకు వెళ్లే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply