అట్టహాసంగా నారా చంద్రబాబు నాయుడు 72వ జన్మదిన వేడుకలు…ఎండి రహీం

Share this:

హన్మకొండ జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 72 వ జన్మదిన వేడుకలు,పార్టీ ఆవిర్భావ దినోత్సవం
సందర్భంగా తెలుగుదేశం రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం పోలీసు హెడ్ క్వార్టర్స్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద
వరంగల్ పశ్చిమ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి
ఎండి రహీం సారధ్యంలో
భారీ కేక్ కట్ చేశారు. అనంతరం కాకతీయ యూనివర్సిటీ టీబీ హాస్పిటల్ నందు పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎండి రహీం మీడియాతో మాట్లాడుతూ టిడిపి హయాంలో తెలుగువారి కీర్తిని ప్రపంచం నలుదిశలా విస్తరించడానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పరిపాలన అందించడం జరిగిందన్నారు.తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకువస్తామని తెలిపారు.
టిడిపి ప్రభుత్వ హయాంలోనే బడుగు,బలహీన వర్గాలకు రాజకీయ,ఆర్థిక స్వావలంబన లభించిందని రహీం తెలిపారు. ఈ సందర్భంగా జై టిడిపి,జై చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ అమర్ రహే అంటూ కార్యకర్తలు భారీగా నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముంజ వెంకట రాజ్యం గౌడ్,సీనియర్ నాయకులు బర్ల యాకోబు, చిలువేరు మహేష్ ,కలిమల మహేందర్,గొల్లపల్లి ఈశ్వర్ చారి,బైరి శేషాద్రి,తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కొంగర ప్రభాకర్,తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి శివరాత్రి వెంకటేశ్వర్లు, మామిండ్ల రాములు,మాడ గాని మనోహర్,వెలగందల రవీందర్ గుప్తా, కటకం కుమారస్వామి,అనిశెట్టి సతీష్, తెలుగుదేశం పార్టీ కార్యాలయం కార్యదర్శి పిట్టల శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply