వ్యాక్సిన్ల తయారీకి రసాయనాలు ఎంతో అవసరం-కె.యూ.రిజిస్ట్రార్ వెంకట్ రాంరెడ్డి

Share this:

హనుమకొండ(V3news) 22-09-2022: హనుమకొండ కాకతీయ ప్రభుత్వ కళాశాల రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో “రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ కెమికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ (రసాయన, పర్యా వరణ శాస్త్రాల ఆవిష్కరణలు)” అనే అంశం పై రెండు రోజుల జాతీయ స్థాయి సదస్సును కాకతీయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వెంకట్రామి రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గోని బుధవారం ప్రారంభించారు.రూసా,రాష్ట్ర ఉన్నత విద్యామండలి సహకారంతో జరుగుతున్న రెండు రోజుల సదస్సు ప్రారంభ సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రిన్సిపల్ డాక్టర్ రాజారెడ్డి మాట్లాడుతూ కళాశాల ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ సదస్సు జరగడం ప్రాధాన్యత సంతరించుకుందన్నారు.
సెమినార్ కన్వీనర్,రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ రమేష్ మాట్లాడుతు సదస్సులో వివిధ రాష్ట్రాల నుండి సుమా రు 170 మంది పరిశోధక పత్రాలు సమర్పించనున్నారని, సదస్సులో ప్రధాన వక్తలుగా IICT హైద రాబాద్,నైపర్ (NIPER), హైద్రాబాద్,హైద్రాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం,ఎన్ ఐ టి ( NIT) వరంగల్ నుండి శాస్త్రవేత్తలను,విద్యావేత్తలను ఆహ్వానించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వెంకట్రామి రెడ్డి మాట్లాడుతూ రసాయన శాస్త్ర ఆవిష్కరాలు మిగతా అన్ని శాస్త్రాలకు మూలమని చివరికి వాక్సిన్ల తయారీకి కూడా రసాయనాలు అవసరమన్నారు.IICT కి చెందిన చీఫ్ సైంటిస్ట్, భారతదేశ ప్రతిష్టాత్మక శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డ్ గ్రహీత డాక్టర్ వెంకట మోహన్ కీలకోపన్యాసం చేసారు.రోజు రోజుకీ పెరుగుతున్న సాంకేతిక అభివృద్ధితో పాటు పర్యావరణ క్షిణత కూడా జరుగుతున్నదని, భావితరాలకు పర్యావరణ వనరులను జాగ్రత్తగా కాపాడి అప్పగించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు.ఈ సదస్సులో IICT కి చెందిన డాక్టర్ ప్రభాకర్,డాక్టర్ రాజేందర్ రెడ్డి,NGRI కి చెందిన డాక్టర్ రామ్ మోహన్,NIT కి చెందిన ప్రొఫెసర్ రాంచంద్రయ్య,ప్రొఫెసర్ లక్ష్మిరెడ్డి,CDC కి చెందిన కుమారస్వామిలు రసాయన శాస్త్రంలో జరుగుతున్న ఆధునిక ఆవిష్కరణల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశోధక విద్యార్థులకు వివరించారు.ఈ సదస్సులో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సంజీవయ్య అధ్యాపకులు సత్యనారాయణ,అశోక్, సునీత,రావుల మొగిలి,జగదీష్ బాబు,వెంకన్న,విజయపాల్ రెడ్డి,నరేందర్ రెడ్డి,లీలావతి, మురళీధర్,రాంబాబు, శంకరయ్య,సొమ్మన్న విద్యార్థులు,పరిశోధకులు,తదితరులు పాల్గొన్నారు.