తెరాసలో చేరిన కాంగ్రెస్ నాయకులు…

Share this:

పరకాల ()v3news)26-08-2022: దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తుందని పరకాల శాసన సభ్యులు శ్రీ చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు. గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సమక్షంలో తెరాస పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే గారు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ… కెసిఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ప్రభావితులై, అభివృద్ది వైపే తాము ఉంటామని నిర్ణయం తీసుకుని టిఆర్ఎస్ పార్టీలో చేరడం శుభ పరిణామం అని ఎమ్మేల్యే అన్నారు. ఇక నుంచి మీరు టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులని మీకు అన్ని విధాల పార్టీ అండగా ఉంటుందని బరోసానిచ్చారు.ప్రతి పల్లెను అన్ని విధాలా అభివృద్ధి చేసుకుంటున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని పార్టీ లో చేరినవారు తెలిపారు.

పార్టీలో చేరినవారిలో మండ మనీల,అక్కెళ్లి ఎలిశా,మంద నాగరాజు,మంద రమేష్,మంద సారమ్మ,మంద బుచ్చమ్మ,గొర్రె పుష్ప,మంద వరమ్మ,తిప్పారపు ప్రశాంత్,మమత,రాంపాక ప్రశాంత్,అక్కెళ్లి జగన్,గొర్రె భిక్షపతి,గొర్రె సుమన్,స్రవంతి,అక్కెళ్లి కొమురయ్య,జన్ను సుధాకర్,మంద రాజబాబు,జన్ను చిరంజీవి లతో పాటు మరికొంత మంది ఉన్నారు .ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు, పాల్గొన్నారు.

Leave a Reply