సిపిఎం పార్టీని విమర్శిస్తే ఊరుకునేది లేదు-సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోట గోపి,ఎలుగురి గోవింద్

Share this:

కుడకుడ లోని ప్రభుత్వ భూమి 126 సర్వే నెంబర్లోని ఇళ్ల స్థలాల విషయంలో సిపిఎం పార్టీని విమర్శించే నైతిక హక్కు సిపిఐ ఎంఎల్ ప్రజా పంథా నాయకులకు,పిఓడబ్ల్యూ నాయకులకు లేదని,సిపిఎం పార్టీని విమర్శిస్తే ఊరుకునేదే లేదని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోట గోపి,ఎలుగురు గోవింద్ లు హెచ్చరించారు. ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంవిఎన్ భవనంలో జరిగిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడుతూ కుడకుడ రెవిన్యూ శివారులోని ప్రభుత్వ సర్వే నెంబర్ 126 లోని నక్కలగండి ప్రాంతంలో కుడకుడ లోని అన్ని వర్గాల ప్రజలు ఇళ్ల స్థలాలు కావాలని గుడిసెలు వేసుకోవడం కోసం వెళితే వారిపై ప్రజా పంథా,పిఓడబ్లు మహిళా నాయకురాలే రెచ్చగొట్టి కర్రలు,రాళ్లతో దాడి చేసి మహిళల తలలు పగలగొట్టించారని అన్నారు. దొంగే దొంగ అన్నట్లుగా మహిళా నాయకురాలిగా చలామణి అవుతూ మహిళల మీదనే దాడులు చేసే విధంగా మహిళలను ప్రోత్సహిస్తున్న నాయకులు సిపిఎం పార్టీని విమర్శించడం హాస్యస్పదంగా ఉందన్నారు.అనునిత్యం పేదల పక్షాన పోరాడుతున్న సిపిఎం పార్టీ కుడకుడ లోని పేదలు ఇళ్ల స్థలాల కోసం మద్దతు ఇస్తే జీర్ణించుకోలేక సిపిఎం పార్టీని విమర్శ చేయడం దుర్మార్గమన్నారు.సిపిఎం పార్టీని విమర్శించడం అంటే సూర్యుడు పై ఉమ్మి వేసిన చందంగా ఉందన్నారు. ప్రజపంథా మరియు పి ఓ డబ్ల్యూ నాయకులు సిపిఎం పార్టీ గుండాలు మహిళలపై దాడులు చేశారంటూ వ్యాఖ్యానించడం అర్ధరహితమని వెంటనే వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని గుర్తు చేశారు.ఇళ్ల స్థలాల పోరాటంలో జరుగుతున్న వాస్తవాలను వక్రీకరించే విధంగా మాట్లాడటం వారికి తగదన్నారు. ప్రజాపంథా రాష్ట్ర నాయకులను తీసుకువచ్చి సూర్యాపేటలో ర్యాలీలు నిర్వహించన ఈ నాయకులే పేద మహిళలపై అధికార పార్టీ గూండాలు దాడి చేశారని పేపర్ ప్రకటనలు చేసి నాలుగు రోజుల తర్వాత సిపిఎం పార్టీ వాళ్లు దాడి చేశారని వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ సమావేశంలో సిపిఎం కూడా శాఖ కార్యదర్శి కంచుగట్ల శ్రీనివాస్ సిఐటియు టౌన్ కన్వీనర్ మామిడి సుందరయ్య సిపిఎం టూ టౌన్ కమిటీ సభ్యురాలు పిండిగ నాగమణి,మర్రి ఎల్లమ్మ గుండెబోయిన సైదమ్మ లు పాల్గొన్నారు