దళిత బంధువు పథకం ద్వారా 57 మంది లబ్ధిదారులకు 5 కోట్ల 64 లక్షల రూపాయల వాహనాలను పంపిణీ

Share this:

దళిత బంధు పథకంతో రాష్ట్రంలోని దళిత కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని-రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

రాజేంద్రనగర్ (V3News)07-06-2022: రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శంషాబాద్ మున్సిపాలిటీ ముచ్చింతల్ లో దళిత బంధువు పథకం ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు వాహనాలు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పల్గున్నీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు, ఆనంతరం దళిత బంధు పథకం ద్వారా ఎంపికైన 57 మంది లబ్ధిదారులకు 5 కోట్ల 64 లక్షల రూపాయల వాహనాలను పంపిణీ చేశారు,ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలు ఏమి కోరుకుంటున్నారో పాలకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అదే అమలు పరుస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన దళితబంధు పధకం కుడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించిందేనని ఆయన స్పష్టం చేశారు. దళితబంధు పథకంతో ఆర్థికాభివృద్ధి సాధించడం తో పాటు సమాజాన్ని నిర్దేశించే వ్యక్తులుగా పెరగాలని ఆయన ఆకాంక్షించారు.

Leave a Reply