ఆసరా పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చల్లా…

Share this:

పార్టీలకు అతీతంగా పారదర్శక పరిపాలన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొనసాగిస్తున్నారని,ఆసరా పెన్షన్లతో వృద్ధుల ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత కేసీఆర్ గారిదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.

ఆదివారం నడికూడ మండలం చర్లపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటుచేసిన ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ల గుర్తింపు కార్డులను అందచేశారు. అర్హులందరికీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందివ్వడమే లక్ష్యంగా, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం అభివృద్ధే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి,జెడ్పిటిసి,సర్పంచులు,ఎంపిటిసిలు,సొసైటీ చైర్మన్లు,కమిటీ సభ్యులు,మార్కెట్ చైర్మన్లు,కమిటీ సభ్యులు,రైతుబంధు, దళితబంధు కమీటీ సభ్యులు,మండల అధికారులు,తెరాస నాయకులు,కార్యకర్తలు,యువ నాయకులు,మహిళలు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గోన్నారు.

Leave a Reply