అమ్మనబోలుని మండలంగా ప్రకటించాలి-ప్రియదర్శిని మేడి

Share this:

అమ్మనబోలు మండల కేంద్రం ఏర్పాటు కావాలని 27వ రోజు మండల సాధన కమిటీ చేస్తున్న నిరసన దీక్ష ధర్నాలో బహుజన్ సమాజ్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియదర్శిని మేడి శుక్రవారం సంఘీభావం తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ 14 గ్రామాల పంచాయతీలతో కూడిన మండల కేంద్రం ఏర్పాటు కావాలని న్యాయమైన ప్రజల డిమాండ్ అని అన్నారు.ఇప్పుడు ఉన్న నార్కట్ పల్లి మండలంకు వెళ్ళాలి అంటే 20 కిలోమీటర్ల దూరం వెళ్లి రావాలి.ప్రభుత్వ ఆఫీసులలో పనులు చేసుకోవాలంటే రెండు మూడు రోజులు తిరగాల్సి వస్తుందన్నారు.ఇప్పటివరకు జరుగుతున్నటువంటి ధర్నా దీక్షలో భాగంగా ఏ ఒక్క రోజు కూడా స్థానిక ఎమ్మెల్యే స్పందించకపోవడం శోచనీయం అని అన్నారు.అభివృద్ధి కోసం పార్టీ మారానన్న ఎమ్మెల్యే మీరు రాజీనామా చేస్తే నకిరేకల్ అభివృద్ధి చెంది కొత్త మండలలు ఏర్పడుతాయి అని అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొత్త మండలం ప్రకటించాలన్నారు.ఈ కార్యక్రమంలో . రంజిత్ రమేష్, మండల సాధన సమితి నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply