భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు

Share this:

భద్రాచలం (V3news) 26-09-2022 : భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి, ఈ ఉత్సవాలలో భాగంగా మొదటి రోజైన నేడు ఆలయంలోని లక్ష్మీ తయారు అమ్మవారు ఆదిలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా లక్ష్మీ తయారు అమ్మవారికి ఉదయం పంచామృతాలతో విశేష అభిషేకం నిర్వహించారు,మధ్యాహ్నం మహానివేదన అనంతరం లక్ష కుంకుమార్చన లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పారాయణం నిర్వహిస్తున్నారు.సాయంత్రం దర్బారు సేవానంతరం లక్ష్మణ సమేత సీతారాములకు లక్ష్మీత య రు అమ్మవారికి తిరువీధి సేవ నిర్వహించనున్నారు. ఈ అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకోవడం వల్ల గ్రహ బాధలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ఆలయ అర్చకులు తెలుపుతున్నారు