అంగడిపేట హనుమాన్ దేవాలయం వద్ద పులిహోర పంపిణీ

సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడిపెట్ హనుమాన్ దేవాలయం లో మంగళవారం స్థానిక ఆర్యవైశ్య నాయకులు నోముల మహేందర్ దంపతుల ఆధ్వర్యంలో హనుమాన్ దేవాలయం లో హనుమాన్ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి దాదాపు రెండు వందల మందికి పులిహోర పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొండ పోచమ్మ దేవస్థానం డైరెక్టర్ గోలి సంతోష్ మాట్లాడుతూ హనుమాన్ ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని అన్నదానం మహా దానం అని మంగళ వారం హనుమాన్ స్వామికి ఇష్టమైన రోజు విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు పులిహోర పంపిణీ చేసిన నోముల మహేందర్ దంపతులను అభినందించారు ప్రతి ఒక్కరూ సేవా నిరతి కలిగి ఉండాలని,అన్ని దానాల కన్న అన్నదానం మిన్న అని,ప్రతి మంగళ వారం పులిహోర పంపిణీ చేయడం అభినందనీయం అని అన్నారు ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి పంతులు, కైలాస ప్రభాకర్, నాయకులు దొంతుల సత్యనారాయణ, కళాధర్, కైలాస ప్రశాంత్,శ్రీనివాస్, అత్తెల్లి నాగేందర్, కల్లూరి సత్యనారాయణ,ఉమేష్, దూబకుంట లచ్చలు, కోల్గుర్ యాదగిరి, ఆదిములం రవి, గందే సంతోష్,ఉమేష్, తదితరులు పాల్గొన్నారు