అట్టాసంగా గురుదామంలో శ్రీ శ్రీ శివానంద మూర్తి జన్మదిన వేడుకలు
వరంగల్ లోని ఆరెపల్లి సమీపంలో ఉన్న గురుదామం పుణ్యక్షేత్రంలో శ్రీ శ్రీ శివానందమూర్తి జన్మదిన వేడుకలు త్రిపురనేని గోపీచంద్ బండారు సాయి నారాయణ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు త్రిపురనేని గోపీచంద్ మాట్లాడుతూ ఈ జన్మదినం వేడుకలకు వేలాది మంది భక్తులు తరలివచ్చారని ఈ జన్మదినం వేడుకలో పాల్గొన్న వారు ధన్యులు అని అన్నారు ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎంతో మంచి జరగాలని అని అన్నారు ఈ జన్మదినం వేడుకలు జరగడం నా పూర్వజన్మ సుకృతం అని అన్నారు.ఈ కార్యక్రమంలో శివానంద గురు కల్చరల్ మేనేజింగ్ ట్రస్టీ త్రిపురనేని గోపీచంద్,ట్రస్టీ సభ్యులు బండారు సాయి నారాయణ,సోమ రామయ్య, మాదారపు సదాశివుడు, పబ్బతి నరేష్ కుమార్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.