కుప్పంలో ఘనంగా అయ్యప్ప స్వామి పూజలు
చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలో గల శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమాంబ దేవాలయంలో శ్రీ మణికంఠ అయ్యప్పస్వామి సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అయ్యప్ప స్వామి అంబలం పెట్టి ఘనంగా స్వామివారికి పూజలు నిర్వహించారు. కుప్పంలో ఉన్న మణికంఠ అయ్యప్పస్వామి సంఘం వారి ఆధ్వర్యంలో కొత్తగా మాలలు వేసిన కన్య స్వాములు మరియు గంట స్వాముల దగ్గర ఎలాంటి రుణ సహాయం తీసుకోకుండానే స్వాములకు ఉచితంగా కమిటీ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాలాధారణలో ఉన్న స్వాములకు పూజలో పాల్గొన్న భక్తులకు ప్రసాదాలు, మరియు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. కుప్పం ప్రాంతంలో ఇంతవరకు ఎవరు చేయని విధంగా శ్రీ మణికంఠ అయ్యప్పస్వామి సేవా సంఘం సభ్యులు పేద కుటుంబాలకు సంబంధించిన స్వాములకు ఉచితంగా కన్నెపూజ, గంట పూజలు, మరియు గురుపూజ, చేయడం హర్షించదగ్గ విషయమని కుప్పం ప్రజలు మణికంఠ అయ్యప్ప స్వామి సేవా సంఘం సభ్యులకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.