ఫైర్ స్టేషన్ దారి మూసివేత

Share this:

అగ్ని ప్రమాదం జరిగితే నిమిషాల్లో చేరుకునే ఫైర్ ఇంజన్కు రాంగ్ రూట్ లో వెళ్ళవలసిన పరిస్థితి

సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొత్త ప ఫైర్ స్టేషన్ ఎదురుగా అత్యవసర సమయంలో ఫైర్ ఇంజన్ బండి వెళ్లేందుకు వీలులేకుండా గుత్తేదారు డివైడర్ నిర్మాణం చేపట్టారు.. జిల్లా కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటే వారు నిమిషాల వ్యవధిలో చేరుకోవాల్సి ఉంటుంది.కాగా ఇక నుండి రాంగ్రూట్లో వెళ్ళవలసిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణ రెడ్డి ,అధికారులు స్పందించి డివైడర్ నిర్మాణం వెంటనే ఆపాలని మేధావులు కోరుతున్నారు. రాంగ్ రూట్ లో అత్య వసర సమయాల్లో వెళ్ళవలసిన ఫైర్ ఇంజన్ బండి సకాలంలో ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకోలేక పోతే భారీగా ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉందని పలువురు వాపోతున్నారు అంతేకాకుండా రాంగ్ రూట్ లో ప్రయాణించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నాయని పలువురు వాపోతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి ఫైర్ ఇంజన్ బండి వెళ్లేందుకు ఆ ప్రాంతంలో డివైడర్ నిర్మాణం ఆపాలని, అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ ఇంజన్ బండి చేరుకునే విధంగా దారిని ఉంచాలని మేధావులు కోరుతున్నారు.

Leave a Reply