మెట్పల్లి ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం
పసికందు మృతి

Share this:

మెట్పల్లి(V3news ) 21-9-2022: మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వర్ష కొండ గ్రామానికి చెందిన ఎర్ర వేణి సుజాత శివ డెలివరీ నిమిత్తం 4 రోజుల క్రితం ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు సుజాత కు ఇది మొదటి కాన్పు కావడంతో డాక్టర్లు ఆస్పత్రి సిబ్బంది అత్యుత్సాహాన్ని చూపిస్తూ నార్మల్ డెలివరీ కొరకు నాలుగు రోజుల నుండి ఆపారు ,కుటుంబ సభ్యులు ఆపరేషన్ చేయమన్నా చేయకుండా ఇది కలెక్టర్ గారి ఆర్డరు ఆపరేషన్ చేయడం కుదరదు అన్నారు.మేము ప్రైవేటు ఆసుపత్రికి తీసుకు వెళ్తామని కోరినా కాళ్ళ వేళ్ళ బ్రతిమిలాడిన మీరు ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకు వెళ్తే కేసు పెడతామని ఆస్పత్రి సిబ్బంది సుజాత కుటుంబ సభ్యులను బెదిరించారు మధ్యాహ్నము 12 గంటలకు డెలివర్ నిమిత్తం రూములోకి తీసుకువెళ్లి శిశువు మరణించిందని కుటుంబ సభ్యులకు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద రోడ్డుపై ధర్నా కు దిగారు