మున్నురుకాపు సోదరులారా టీఆరెఎస్ మాయలో పడొద్దు-బిజేపి నేత గంట రవి కుమార్

Share this:

అవినీతిపరుడికి అండగా ఉంటారా..

-దేశ వ్యాప్తంగా అవినీతి పరులపై ఈడి, ఐటి శాఖలకు కులం, మతం ఉండదు..

తప్పుదోవ పట్టిస్తున్న ఎమ్మెల్యే నరేందర్ మాయలో పడొద్దు..

-ప్రధాని మోడీ దిష్టి బొమ్మలను దహనం చేయడం సిగ్గుచేటు

అవినీతి నుండి కాపాడు కోవడం కోసం కులాన్ని అడ్డు పెట్టుకోవడం సిగ్గు సిగ్గుచేటని బిజేపి వరంగల్ తూర్పు నియోజకవర్గ నాయకుడు గంట రవికుమార్ అన్నారు.

◆మంత్రి గంగుల కమలాకర్ ఇంటి పై ఈడి, ఐటీ శాఖకు దాడులు చేస్తే కొందరు దుర్మార్గంగా, ప్రధాని నరేంద్ర మోడీ దిష్టి బొమ్మలు దహనం చేయడం సిగ్గుచేటన్నారు.

◆రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), ఆదాయపు పన్ను (ఐటీ) శాఖల అధికారులు సోదాలు నిర్వహించడాన్ని వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ రాజకీయం చేయడం హాస్యాస్పదంగా ఉంది.
గ్రానైట్‌ వ్యాపారంలో విదేశీ మారక దవ్య్ర నిర్వహణ చట్టాన్ని (ఫెమా) ఉల్లంఘించారనే అభియోగాలతో ఈడీ, ఐటీ అధికారులు ఈ సోదాలు చేసింది.
ఇవి ఒక్క మంత్రి ఇంటికే పరిమితం కాలేదు, గ్రానైట్‌ వ్యాపారంతో సంబంధం ఉన్న వారి ఇళ్లల్లో, కార్యాలయాల్లో జరిగాయి. అనేక ఏళ్లుగా గ్రానైట్‌ వ్యాపారం చేస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌ కుటుంబంపై గతంలోనే అనేక ఆరోపణలు వచ్చాయని, వీటిపైన విచారణలు కూడా కొనసాగుతున్నాయని గుర్తు చేశారు.
ఈ క్రమంలోనే ఈడీ, ఐటీ అధికారులు తాజాగా సోదాలు నిర్వహించిందని, ఇవి వారి విధి నిర్వహణలో భాగమన్నారు. దేశంలోనే అత్యున్నత విచారణ సంస్థల్లో ఒకటైన ఈడీ సోదాలను తప్పుబట్టడం ఎమ్మెల్యే నరేందర్‌కే చెల్లింది. రాజ్యాంగబద్దమైన వ్యవస్థలను అడ్డుకునే కుట్రల్లో భాగమే టీఆర్‌ఎస్‌ నిరసనలుగా అభివర్ణించారు.

◆రాష్ట్రంలో నియంత పోకడలతో పాలన సాగిస్తున్న కేసీఆర్‌ సర్కారు– కేంద్ర సంస్థలు చేసే ప్రతీ చర్యను విమర్శించడం పనిగా పెట్టుకోవడం ఎంతమాత్రం క్షమార్హం కాదనీ, మున్నూరుకాపులు
టీఆర్‌ఎస్‌ నాయకుల మాయలో పడొద్దని అన్నారు. ఓ అవినీతి పరుడికి వంతపాడమని, ఓ నాయకుడు చెప్పడం వెనక మర్మం తెలుసుకోవాలని సూచించారు. విచారణ సంస్థలకు కుల మత భేదాలు ఉండవనే సత్యం ఆ నాయకులకు తెలియకపోవడం విచారకరమని గంట రవికుమార్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడాన్ని బీజేపీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నటు గంట రవికుమార్‌ స్పష్టం చేశారు

◆కులసంఘాలు ఆ కులానికి చెందిన పేదలను ఆదుకోవడానికి, వారి ఎదుగుదల కు తొడ్పాడాలి కాని బలిసిన వాళ్ళ పంచన చేరి వారి అవినీతికి రక్షణకవచం గా ఉండడం అత్యంత జూగుప్సకరమైన విషయం….
మీరు చేసే చర్యలు ఏ మున్నూరు కాపు బిడ్డ హర్షించడు….
నీతి నిజాయితే ఊపిరైనా మున్నూరు కాపు జాతిని మీ స్వార్థప్రయోజనాల కోసం వాడితే మున్నూరు కాపు సమాజం నుండి ప్రతిఘటన తప్పదని ఈ సందర్బంగా హెచ్చరుస్తున్నాం….

◆కొందరు పైసలకు, పదవులకు, కాంట్రాక్టులకు అమ్ముడుపోయి తామే కులసంఘాలకు ప్రతినిధులం అన్నట్లు ప్రవర్తిస్తూ, మున్నూరుకాపులను పక్కదోవ పాటిస్తున్నారు.

◆మున్నూరు కాపు సంఘాల పేరు మీద కొందరు TRS పెంపుడు ఏజెంట్స్ మోడి గారి బొమ్మలు దహనం చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు.