తప్పని నీటి కష్టాలు

Share this:

  • అసంబద్దంగా,ఆశాస్త్రీయంగా రోడ్డు వర్క్
  • అధికారులకు కాంట్రాక్టర్లకు మధ్య సమన్వయ లోపం
  • మంచి ఎండాకాలంలో నీటి సరఫరా చేయలేని దుస్థితి

సూర్యాపేట(V3News): సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పాత జాతీయ రహదారి రోడ్డు విస్తరణ పనులకు మంత్రి జగదీష్ రెడ్డి అహర్నిశలు కష్టపడి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఒప్పించి సుమారు 19 కోట్ల వ్యయంతో కోర్టు చౌరస్తా నుండి ఎస్ వి ఇంజనీరింగ్ కళాశాల వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న విషయం విదితమే.ఈ నేపథ్యంలో సూర్యాపేట మున్సిపాలిటీ నుండి పలు వార్డులకు మంచినీటి సరఫరాకు అధికారులు ,కాంట్రాక్టర్ల మధ్య సమన్వయ లోపంతో ప్రజలు తీవ్ర నీటి ఇబ్బందులకు గురవుతున్నారు.వివిధ వార్డులో నీటి సరఫరా లేక సుమారు 30 రోజులు అవుతుందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి సరపరా జరిగిన అక్కడక్కడ లీకేజీ సమస్యలతో చివరివరకూ అందకపోవడంతో ప్రజలకు తీవ్ర ఇక్కట్లు తప్పడం లేదు.అదే విధంగా నీటి ట్యాంకర్లు కూడా సమయానికి వివిధ వార్డుల్లో పంపక పోవడం వల్ల వివిధ వార్డు కౌన్సిలర్ లు ప్రైవేట్ ట్యాంకర్ల మీద ఆధారపడి ప్రజలకు నీటి సరఫరా చేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు కాంట్రాక్టర్లు కళ్ళు తెరిచి ఎక్కడెక్కడ లీకేజీ సమస్య ఉందో గుర్తించి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపాలని గొంతు ఎండిన ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply