జనగామ లో ఘనంగా రంజాన్ వేడుకలు

Share this:

రంజాన్ పర్వదినం సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలోని ఈద్గాలో 5000 ముస్లిం సోదరులు ప్రార్థనలలో పాల్గొన్నారు

జనగామ(V3 News ) 04-05-2022: రంజాన్ పర్వదినం సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలోని ఈద్గాలో 5000 ముస్లిం సోదరులు ప్రార్థనలలో పాల్గొన్నారు ,నెలరోజుల కఠోర ఉపవాసం తర్వాత రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు నమాజను పాటించి, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ సందర్భంగా జనగామ ముస్లిం కమిటీ ప్రెసిడెంట్ మొహమ్మద్ అన్వర్ మరియు జనగామ 28వ వార్డు కౌన్సిలర్ సమ్మధ్ మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన రంజాన్ పర్వదినం పురస్కరించుకొని జనగామ జిల్లా కేంద్రంలోని ఈద్గా దర్గా వద్ద ముస్లిం సోదరులు హాజరై ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని అందరి దేశ ప్రజల సుఖ సంతోషాలను కోరుతూ రంజాన్ పర్వదినాన ప్రార్థన లో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈ వేడుకలను ఏర్పాట్లుకు ముందు ఉండి సహకరించిన జనగామ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు
రంజాన్ పర్వదినం సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలోని బచ్చన్నపేట వెళ్ళే రోడ్ వద్ద ఉన్న ఈద్గా దర్గాలో 5000 మంది ముస్లిం సోదరులు ప్రార్థనలో పాల్గొని, నమాజను పాటించి, అందరూ ఒకరికి ఒకరు కృతజ్ఞతలు హలై భలై చేస్తూ సోదరీ, సోదరీమణులకు, రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆ అల్లా దయవల్ల ప్రజలందరూ సుఖ, సంతోషల తో ఉండాలని అల్లాకి ప్రార్థన చేశారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున లింగయ్య , టిఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ తాళ్ల సురేష్ రెడ్డి అందరికీ స్వీట్స్ ఏర్పాటు చేశారు, కౌన్సిలర్లు టిఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు, ముస్లిం మత పెద్దలు, ఈద్గా కమిటీ సభ్యులు, ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Leave a Reply