రామకుప్పం మండలంలో ఏనుగులు స్వైర విహారం.

Share this:

అడవిలో నుంచి వచ్చిన ఏనుగులు బందార్లపల్లి గ్రామాల్లో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఆయా గ్రామాల్లో వరి, అరటి, టమోటా, బీన్స్ తదితర పంటలను ధ్వంసం చేశాయి.గత 10 రోజులుగా ఏనుగులు తమ గ్రామాల్లో సంచరిస్తూ పంటలను నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.ఏనుగుల భయంతో ఎక్కడికైనా వెళ్లాలంటేనే భయమేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఏనుగులు తిరిగి అడవిలోకి వెళ్లేలా ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు..కష్టపడి సాగు చేసిన పంటల్ని నాశనం చేశాయని, భారీగా నష్టపోయామని చెబుతున్నారు. ఇప్పటికే అధికారులు స్పందించి ఏనుగులను అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు చర్యలు తీసుకోవాలంటున్నారు..లేకపోతే తమకు ఇబ్బందులు తప్పవంటున్నారు.ఏనుగులు ధ్వంసం చేసిన పంటలకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలనీ రైతులు కోరుతున్నారు..