వైసిపి ప్రభుత్వంలో అర్హతలు బట్టే సంక్షేమ పథకాలు.

Share this:

  • గత ప్రభుత్వంలో పార్టీనాయకులకే సంక్షేమ పథకాలు.
  • వైసీపీ ప్లీనరీలో ప్రభుత్వ విప్ చిర్ల, ఎమ్మెల్సీ బోసు, ఎంపీ అనురాధ

రావులపాలెం(v3News)27-06-2022: అర్హత ఉన్న ప్రతి పేదకుటుంబాని సంక్షేమ పథకాలు ఇంటికి చేరువ కావాలనే ప్రధాన లక్ష్యంతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్, సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారని కొత్తపేట ఎమ్మెల్యే, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు. కొత్తపేట నియోజకవర్గ వైసిపి ప్లీనరీ సమావేశం రావులపాలెంలో జానికమ్మ రాయు వద్ద కార్యకర్తల కేరింతలతో గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ ప్లీనరీలో మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు, తూర్పుగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ వేణుగోపాల్, డిసిఎంఎస్ చైర్మన్ సాకా మణికుమారి, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, అమలాపురం ఎంపీ చింతా అనురాధ తదితరులు మాట్లాడుతూ లబ్ధిదారులకు ప్రభుత్వానికి మధ్య ఎటువంటి మీడియేటర్లు లేకుండా పథకాల సొమ్ము నేరుగా పేదల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు. నాడు నేడు ద్వారా ప్రతి చిన్నారికి ఆంగ్లంలో మంచి ప్రావీణ్యం కల్పించే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టిన ప్రభుత్వం వైసిపిదేనని అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదం మన ప్రభుత్వంలో జరగకూడదనే సీఎం వాలంటీర్, సచివాలయ వ్యవస్థను ప్రవేశ పెట్టారన్నారు. దీనివల్ల నిరుద్యోగ యువతీ యువకులకు లక్షల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కూడా లభించాయన్నారు. గ్రామ సచివాలయం, ఆర్బికే, ఆరోగ్య ఉప కేంద్రాలు, మినీ లైబ్రరీలు గ్రామాల్లో అందుబాటులో ఉండాలని సీఎం సంకల్పించారన్నారు. దానికి అనుగుణంగా నిర్మాణాలు జరుతున్నాయన్నారు. మన ప్రభుత్వం అర్హతలు బట్టి పథకాలు వర్తింపజేస్తే, గత ప్రభుత్వం పార్టీని బట్టి సంక్షేమ పథకాలు వర్తింపు చేసిందన్నారు. మనమంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మరింత బలపర్చాలని అన్నారు…

Leave a Reply