వరంగల్ రైతుసదస్సులో గర్జించిన ఎమ్మెల్యే ఈటెల రాజేందర్

Share this:

వరంగల్(V3News)08-04-2022: వరంగల్ జిల్లా ఆకుతోట కన్వెన్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కోసం ఏర్పాటు చేసిన రైతు సదస్సుకు ముఖ్య అతిథిగా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని గర్జించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల ప్రయోజనాలను పక్కన పెట్టి డ్రామాలాడుతున్నారని,పంజాబ్ రాష్ట్రం లాంటి వ్యవసాయం, తెలంగాణ రాష్ట్రంలో లేదన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ అవలంబిస్తున్న పనులు గమని స్తున్నారన్నారు.తగిన సమయంలో తెరాస పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు,రాష్ట్ర, జిల్లా నేతలు,నాయకులు,కార్యకర్తలు,రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply