భారతీయ జనతా పార్టీలో చేరిన మాజీ కార్పొరేటర్ నాగమళ్ళ ఝాన్సీలక్ష్మీ,నాగమళ్ళ సంతోష్ కుమార్

Share this:

హన్మకొండ జిల్లా హాసన్ పర్తి మండల కేంద్రంలో రెండు దశాబ్దాల కాలం సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మాజీ కార్పొరేటర్ నాగమళ్ళ ఝాన్సీలక్ష్మీ,యువ నాయకులు నాగమళ్ళ సంతోష్ కుమార్,వారి అనుచరులు సుమారు వంద మంది హనుమకొండ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ,66వ డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివ కుమార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని బిజెపి పార్టీ కార్యాలయంలో సాయంత్రం
బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా నాగమళ్ళ ఝాన్సీలక్ష్మీ,నాగమళ్ళ సంతోష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీ పార్టీలో చేరినట్లు తెలిపారు.
హాసన్ పర్తి మండల కేంద్రంలో బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు.

Leave a Reply