థామస్ కప్ 2022 సాధించిన విష్ణు వర్ధన్ గౌడ్ కు అంబర్పేటలో ఘన సన్మానం

Share this:

థామస్ వరల్డ్ కప్ 2022 పోటీలో తొలిసారిగా భారతదేశానికి బంగారు పతకాన్ని సాధించిన విష్ణు వర్ధన్ గౌడ్ కు అంబర్పేటలో ఘన సన్మానం జరిగింది ఇటీవల బ్యాంకక్ జరిగిన ప్రపంచ కప్ పోటీల్లో బంగారు పతకం సాధించిన విష్ణు వర్ధన్ గౌడ్ ను స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాజీ ఎంపీ వీ హనుమంతరావు అంబర్ పేట మున్సిపల్ స్టేడియంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలలో రాణించి దేశానికి పేరు ప్రఖ్యాతలు సాధించిన విష్ణు వర్ధన్ గౌడ్ అంబర్పేట నివాసి కావడం అభినందనీయం యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకొని క్రీడల్లో రాణించి దేశానికి మంచి పేరు తేవాలని వారు కోరారు విష్ణువర్ధన్ మాట్లాడుతూ ఇంతవరకూ మన దేశం చెందిన ఏ క్రీడాకారులు సాధించని థామస్ కప్పును సాధించడం నాకు చాలా గర్వంగా ఉందని చెప్పారు మరిన్ని అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని ప్రతిభను చాటుతాం అని ధీమా వ్యక్తం చేశారు మరియు రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని కోరారు తనను ఆదుకోవాలని తనది బీద కుటుంబం అని ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సహించాలని ఆయన కోరారు

Leave a Reply