అగ్ని మాపక భద్రత వారోత్సవాలు,అవగాహన కార్యక్రమాలు – రాష్ట్ర ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు,

Share this:

సంగారెడ్డి (v3News) 18-04-2022: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు అగ్ని మాపక శాఖ ఆద్వర్యంలో అగ్ని మాపక భద్రత వారోత్సవాలను రాష్ట్ర ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ లక్ష్మీ ప్రసాద్ ప్రారంభించారు, వివిద రకాల అగ్ని మాపక వాహనాలతో పటాన్ చెరు నుండి సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించారు, ఈ ర్యాలీలో వివిధ జిల్లాల అగ్నిమాపక ఆఫీసర్ లు పటాన్ చెరు అగ్ని మాపక సిబ్బంది పాల్గొన్నారు, ఈ సందర్భంగా అగ్ని మాపక రాష్ట డైరెక్టర్ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల భారీ నుండి ప్రజలను రక్షించేందుకు నిరంతరం అగ్నిమాపక సిబ్బంది తమ సేవలను అందిస్తారని వాటిని ప్రజలు సకాలములో సద్విని యోగం చేసుకోవాలని తెలిపారు, అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వివిధ అగ్ని మాపక వాహానాలతో ర్యాలి కార్య క్రమాన్ని చేపట్టామని తెలిపారు . ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల అగ్నిమాపక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply