అగ్నిప్రమాదాలపై సువెన్ ఫార్మా కంపెనీలో అవగాహన సదస్సు నిర్వహించిన ఫైర్ స్టేషన్ ఎస్ ఐ శ్రీనివాస్

Share this:

సూర్యాపేట( V3News) 18-04-2022: సువెన్ ఫార్మాలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా అగ్ని ప్రమాదాల నివారణ, తీసుకోవలసిన జాగ్రత్తలపై ఫైర్ స్టేషను ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు…. వివిధ రకాల అగ్ని ప్రమాదాలు, నివారణకు తీసుకొవలసిన చర్యలు, ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అగ్ని మాపక యంత్రాలను ఎలా ఉపయోగించాలనే విషయాలపై సూర్యాపేట ఫైర్ స్టేషన్ ఎస్ఐ శ్రీనివాస్ వివరించారు…. ఫ్యాక్టరీ లో ప్రమాదం జరిగినప్పుడు వివిధ రకాల పరికరాల వాడకంపై అవగాహన కల్పించారు. గ్యాస్ సిలిండర్ నుండి గ్యాస్ లీకైతే భయపడకుండా దుప్పటిని తడిపి సిలిండర్ చుట్టూ కప్పి ఆర్పివేయాలని ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. ప్రమాద సమయంలో అందుబాటులో వున్న వస్తువులతో మంటలను ఆర్పివేయడానికి ప్రయత్నం చేయాలని, ఒక్కసారిగా తలుపులు తీయడం ద్వారా గాలి ఎక్కువగా వచ్చి మంట ఎక్కువ అవుతుందని, కాబట్టి నెమ్మదిగా తలుపులు తెరవాలని అన్నారు. ఫ్యాక్టరీ లో మంటలు ఆర్పే పరికరాలు వాడకం పట్ల సిబ్బంది అవగాహన కలిగి వుండాలని అన్నారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా వున్నప్పుడు అందరిని అలర్ట్ చేయాలని, ఫైర్ స్టేషను నంబర్ 101 కు కాల్ చేయాలని అన్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స కోసం ఎత్తుకుని వెళ్లడంపై డెమో చేసి చూపించారు. ఈ సందర్భంగా సువెన్ ఫార్మా యూనిట్ వైస్ ప్రెసిడెంట్ కెవి శేషగిరిరావు మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలపై ఉద్యోగులకు నిత్యం శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. పబ్లిక్ రిలేషన్స్ ఎజిఎమ్ బూర రాములు మాట్లాడుతూ సంస్ధలో అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తూ అగ్ని మాపక శాఖ వారితో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు. సిబ్బందికి అవగాహన కల్పించిన ఎస్ ఐ శ్రీనివాస్ కు సిబ్బందికి ధన్యవాదములు తెలిపారు. కార్యక్రమంలో సేఫ్టి మేనేజర్ పివి రమణ, సెక్యూరిటీ సిబ్బంది, కార్మికులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply