ప్రజాప్రతినిధులు,అధికారుల సమిష్టి కృషితో వరదల్ని నివారించాం….హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

Share this:

హనుమకొండ(V3News)16-07-2022: హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు,అధికారుల సమిష్టి కృషితో ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా వరదల్ని నివారించామని తెలిపారు.గత ఆరు రోజులుగా వరంగల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో జరిగిన నష్టాలపై తీసుకోవలిసిన చర్యలపై హనుమకొండ,వరంగల్ జిల్లాల కలెక్టర్లు,ఎమ్మెల్యేలు,ఎంపీలు, ఎమ్మెల్సీలు,జెడ్పీ చైర్మన్లు,నగర మేయర్,పోలీసు కమిషనర్,మున్సిపల్ కమిషనర్లతో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సమీక్ష సమావేశం నిర్వహించారని తెలిపారు.విద్యుత్ శాఖ అధికారులు కరంట్ పోల్స్,ట్రాస్ఫార్మర్స్ మరమ్మతులు తక్షణమే చేపట్టాలని,వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో వర్షాలకు దెబ్బతిన్న పంటల నష్టాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని,అలాగే నగరంలో దెబ్బతిన్న రోడ్లను,గుంటలకు వెంటనే మరమ్మతులు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సూచించారని తెలిపారు

Leave a Reply