పరకాల పట్టణ కేంద్రంలో ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంబించిన ఎమ్మెల్యే చల్లా…సి.పి.తరుణ్ జోషి
Share this:
పరకాల(V3News) 18-04-2022: పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు నిరుద్యోగుల కోసం ఓ బృహత్తర కార్యక్రామానికి శ్రీకారం చుట్టారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న వేలాది ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో వేల రూపాయల ఫీజులు కట్టి కోచింగ్ తీసుకోలేని పేద విద్యార్థుల కోసం చల్లా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణా కేంద్రం పరకాల పట్టణంలోని ఏర్పాటు చేయడం జరిగింది.
సోమవారం ఉదయం పట్టణంలోని డి.పి.ఆర్.గార్డెన్స్ లో వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి గారితో కలిసి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు ఈ ఉచిత కోచింగ్ సెంటర్ ని ప్రారంభించారు.పోటీ పరీక్షల్లో రాణించేలా వారికి తగిన శిక్షణ తరగతులను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.చల్లా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేడు నియోజకవర్గంలోని పరకాల మున్సిపాలిటీతోపాటు పరకాల, నడికూడ, దామెర, ఆత్మకూరు మండలాల్లోని నిరుద్యోగులకు కోసం ఈ రోజు ఉచితంగా కోచింగ్ సెంటర్ ప్రారంభించుకున్నట్లు తెలిపారు.గీసుగొండ,ఖిలా వరంగల్ మరియు సంగెం మండలాల వారికోసం రేపు సెంటర్ ప్రారంభించుకొనున్నట్లు తెలిపారు.పేద విద్యార్థుల కోసం ఉచితంగా కోచింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారిని సిపి తరుణ్ జోషి గారు అభినందనలు తెలిపారు.ఇంత మంచి అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.కష్టపడితే ఫలితం ఖచ్చితంగా వస్తుందని,ఉద్యోగం సాధిస్తే ప్రజలకు సేవచేసే మంచి అవకాశం దొరుకుతుందన్నారు.
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు నిరుద్యోగుల కోసం ఓ బృహత్తర కార్యక్రామానికి శ్రీకారం చుట్టారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న వేలాది ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో వేల రూపాయల ఫీజులు కట్టి కోచింగ్ తీసుకోలేని పేద విద్యార్థుల కోసం చల్లా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణా కేంద్రం పరకాల పట్టణంలోని ఏర్పాటు చేయడం జరిగింది.


