జెకె ఒసి పరిసర గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ

Share this:

ఇల్లందు(V3News) 04-04-2022: ఇల్లందు ఏరియా జెకె ఒసి ప్రభావిత గ్రామం విజయలక్ష్మి నగర్ గ్రామా పంచాయతి లో ఈ రోజు సింగరేణి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సింగరేణి ఇల్లందు ఏరియా జిఎం మల్లెల సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జియం గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఇల్లందు ఏరియా లో జెకె ఒసి నూతన గని విస్తరిస్తున్న తరుణంలో సమీప గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగు పరచడం అలాగే వివిధ సమస్యలతో బాధపడే వారికి ఉచితంగా వైద్య సదుపాయం కల్పించడం వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కావున గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

గ్రామ సర్పంచ్ పూనెం కవిత, ఎం.పి.టి.సి. పూనెం సుదర్శన్ మాట్లాడుతూ గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలని అలాగే ప్రతి 15 రోజులకు ఒకసారి వైద్య శిబిరం నిర్వహించాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో యస్వోటు జియం బండి వెంకటయ్య, డిజిఎం పర్సనల్ జీవి.మోహనరావు, సీనియర్ ఎస్టేట్ అధికారి భుక్య తౌర్య, డి.వై.సి.ఎం.ఓ. డా.నేరేళ్ళు, మెడికల్ సూపరిండెంట్ డా.ఇ.విక్రం, స్టాఫ్ నర్స్ గ్రేస్ మనోహర్ రాణి, గ్రామ సర్పంచ్ పూనెం పి.కవిత, ఎం.పి.టి.సి. పూనెం సుదర్శన్, పంచాయతీ సెక్రటరీ సంజీవ, కో-ఆప్షన్ మెంబర్ వెంకటరాజం, కార్యదర్శి హరిసింగ్ మరియు గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply