‘గడ్డెన్న వాగు’ కు గడ్డుకాలం

Share this:

ఆనవాళ్లు కోల్పోతున్న ప్రాజెక్ట్ ఫ్లడ్ బ్యాంకులు

భైంసా(V3News) 30-07-2022: నిర్మల్ జిల్లా భైంసా పట్టణ శివారులో ఉన్న గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు గడ్డుకాలం ఏర్పడింది. ప్రాజెక్టు స్పిల్ వే దిగువన ఉన్న ఫ్లడ్ బ్యాంకులు (వరద కట్టలు) ఇరువైపుల తెగిపోయాయి. గత పక్షం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆఫీసర్లు 60వేల క్యూసెక్కుల నీటిని సుద్దవాగులోకి వదిలేశారు. ఇటీవలే ఈ వరద కట్టలు తెగిపోయి ఆనవాళ్లు లేకుండా పోయాయి. నీరంతా పక్కనున్న పంట పొలాల్లో చేరుతుంది. కాగా మూడు నెలల క్రితమే డీఎస్ఆర్పీ (డ్యాం సేఫ్టీ రిహాబిటేషన్ ప్రోగ్రాం) ఆఫీసర్లు ప్రాజెక్టును సందర్శించి వరద కట్టలకు ముప్పు ఉందని హెచ్చరించారు. మరమ్మత్తులకు నిధులు కేటాయించాలని ఆఫీసర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన పట్టించుకోలేదు. ఇదే వరద కొనసాగితే వరద కట్టలతో పాటు డ్యాంకు ముప్పు ఉందని నిపుణులు చెబుతున్నారు. అటు డ్యాం గేట్లకు లీకేజీలు సైతం ఏర్పడ్డాయి. వరద లేని సమయంలో నీరంతా వృథా పోతుంది.

Leave a Reply