పెనుయేలు చర్చిలో ఘనంగా గుడ్ ఫ్రైడే పండుగ

Share this:

మునగాల (V3News ) 15-04-2022:మునగాల మండల కేంద్రంలోని పెనుయేలు వర్షిప్ సెంటర్ నందు శుక్రవారం గుడ్ ఫ్రైడే ఆరాధన నిర్వహించారు. తొలుత గుడ్ ఫ్రైడే సంకీర్తనలు ఆలపించారు. గుడ్ ఫ్రైడేను ఉద్దేశించి ఆ సంఘకాపరి బిషప్ డాక్టర్ జె సుదర్శనం మాట్లాడుతూ, ప్రపంచ మానవాళి కోసం తనం ప్రాణం ప్రణంగా పెట్టి తన స్వరక్తంతో మనల్ని కొని మన పాపముల నుండి విడిపించేందుకు ఈ భూమి మీదకు దైవ కుమారుడు అయిన క్రీస్తు యేసు వచ్చి సర్వ మానవాళి రక్షణ కోసం ప్రాణం పెట్టి..మనల్ని ఈ లోక పాపముల నుండి యేసుక్రీస్తు విడిపించాడు అని, యేసుక్రీస్తు వారు సిలువపై పలికిన చివరి ఏడు మాటలు మరియు వివరణ చెప్పి ఆయన సంఘంలో భోదించాడు. మన నుండి ఏమి ఆశించకుండా మన మనస్సు మార్చుకోమని చెప్పిన గ్రంధం పాపాలను విడిచి పెట్టి సత్యంలో నడవాలని బోధించిన సత్య వాక్యం బైబిల్ అని అన్నారు. అందరూ మారు మనస్సు పొంది బైబిల్ మార్గంలో నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కె.రాజు, కరుణ, సువార్తరాజు, జాన్ కోటయ్య, తిరుమల, తబితమ్మ, లూథియా, స్టీవెన్ పాల్, ఉదయ్, నతానియేలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply