పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో అద్భుత ఫలితాలు….

Share this:

దేశంలోనే ఉత్తమ ఆదర్శ గ్రామాలుగా నిలుస్తున్న తెలంగాణ గ్రామాలు ….

కోటి 80లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి…..

వరంగల్(V3News) 30-08-2022: రాఫ్ట్రంలోని ప్రతీ గ్రామంలో పారిశుద్యం, పచ్చదనంతో పాటు ఆరోగ్య తెలంగాణ నిర్మించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్థన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు తెలిపారు.పర్వతగిరి మండలం ఇస్లావత్ తండా, చెరువుకొమ్ము తండా, ఏబీ తండా, దౌలత్ నగర్ గ్రామాలలో సుమారు కోటి 80లక్షలతో చేపట్టిన వైకుంఠ దమాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డ్, అంతర్గత సిసి రోడ్లను ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని గ్రామాలను అభివ్రుద్ది చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అన్నారు. దీనిలో భాగంగా ప్రతీ నెల గ్రామ పంచాయితీలకు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో ఇప్పటికే గ్రామాల్లో ఘననీయమైన అభివ్రుద్ది పనులు జరుగుతున్నాయని తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని, గ్రామాల్లో అభివ్రుద్ది పనులను ఎప్పటికప్పుడు గుర్తించి వాటిని పూర్తి చేయాలని అన్నారు. అన్ని గ్రామాల్లో తప్పనిసరిగా వైకుంఠ దామాలు, డంపింగ్ యార్డులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.