ప్రభుత్వ హాస్పిటల్ సమస్యలు పరిష్కరించాలి–PDSU,POW

Share this:

మునగాల( V3News) 08-07-2022: సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ ను పిడిఎస్ యు, పిఓడబ్ల్యూ ఆధ్వర్యంలో సందర్శించి పిఓడబ్ల్యు జిల్లా ప్రధానకార్యదర్శి కొత్తపల్లి రేణుక,పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి మాట్లాడుతూ, అనేక సమస్యలతో హాస్పిటల్ సిబ్బంది మరియు ఇక్కడికి వస్తున్న పేషెంట్లు ఇబ్బందులకు గురవుతున్నారు. హాస్పిటల్ కి సొంత బిల్డింగ్ లేక పాత బిల్డింగ్ ఉన్నట్టువంటి తో వర్షాలు వచ్చి కురిసి బిల్డింగ్ కూలిపోయే పరిస్థితిలో ఉన్నది ఒకటే గదిలో ఓపి టెస్టులు చెకప్స్ జరుగుతున్నాయి హాస్పిటల్ సిబ్బంది కూడా అదే రూమ్ లో భోజనం చేయలేక అవస్థలు పడుతున్నారు గతంలో ఇదే హాస్పటల్లో ఆపరేషన్లు, పోస్టుమార్టం జరిగేవి.నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు అధికారుల నిర్లక్ష్యం వల్ల హాస్పిటల్ అభివృద్ధి కి నోచుకోకుండా అధ్వానంగా తయారయింది. ప్రహరీ గోడ లేకపోవడం వలన మందుబాబులకి అడ్డాగా మారి మందు సీసాలతో మరియు చెత్త చెదారంతో హాస్పటల్ ఆవరణం నిండి ఉన్నది కాబట్టి సంబంధించిన అధికారులు నియోజవర్గ ఎమ్మెల్యే స్పందించి యుద్ధ ప్రాతిపదికరణ హాస్పిటల్ సమస్యలు పరిష్కరించి నూతన భవనం నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే గ్రామాలలో సీజనల్ వ్యాధులు రాకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యు జిల్లా అధ్యక్షులు చంద్రకళ, నాయకులు జయమ్మ ,సంతోషి లలిత, పిడిఎస్యు జిల్లా కార్యదర్శి ఎర్ర అఖిల్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply