ఉచిత కోచింగ్ సెంటర్ ను సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు పొందాలి -మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Share this:

పరిగి(V3News) 18-04-2022: నిరుద్యోగ యువత కోసం వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని శారదా గార్డెన్2 లో ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఉచిత కోచింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగింది. సోమవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో కలిసి కోచింగ్ సెంటర్ సెంటర్ ను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో ఆయా శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించడంతో అట్టి ఉద్యోగాలకు పోటీ పరీక్షలకు యువతీ యువకుల కు ఉచితంగా కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పరిగి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు పొందాలని సూచించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తో పాటు, ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పిస్తామని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply