నేడు ఎదుర్కొంటున్న అనేక కష్టనష్టాలను తొలగించుకునేందుకు భక్తి మార్గం ఒక్కటే

Share this:

నంద్యాల(v3News) 01-05-2022: నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం గోవింద పల్లె గ్రామంలో నేడు ప్రపంచంలో ఎదుర్కొంటున్న అనేక మానసిక ఒత్తిళ్లకు ,ఆందోళన లకు, పరిష్కార మార్గం కేవలం భక్తి మార్గం ఒక్కటేనని జగద్గురు శ్రీల ప్రభు పాద స్వాముల వారు అన్నారు.సిరివెళ్ల మండలం గోవింద పల్లె గ్రామంలో పల్లకి సేవా కార్యక్రమాలను విశ్వ హిందూ పరిషత్ మరియు హరే కృష్ణ మూవ్ మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ చైతన్య కృష్ణ దాస గారు మాట్లాడుతూ హరే కృష్ణ కృష్ణ చైతన్యము వలన ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండగలరని భగవద్గీతలో చెప్పిన రహస్యమైన సారాంశాన్ని తెలియజేశారు.పిల్లల నుంచి పెద్దల వరకు రాజకీయ నాయకుల నుంచి రైతులు వరకు ప్రతి ఒక్కరూ ఈ భక్తి యోగాన్ని సాధన చేయడం వలన నిరంతరం ఆనంద దాయకంగా ఉంటారని అన్నారు.పల్లకిసేవ తదనంతరం హరే కృష్ణ మూమెంట్ ట్రస్ట్ చైతన్య ప్రభు గారు మాట్లాడుతూ గ్రామ గ్రామాన హరే కృష్ణ జప మంత్రాన్ని ప్రజల్లోకి తీసు కెళ్లడానికి ప్రయత్నం చేస్తు న్నామని అందులో భాగంగా శ్రీకృష్ణుడు , నరసింహ స్వామి చేసిన లీలలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నా మని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ప్రకాండ జిల్లా ప్రముఖ వై వి రామయ్య ,హరే కృష్ణ మూమెంట్ ట్రస్ట్ సభ్యులు నాగమల్లేశ్వర్ రెడ్డి ,శివ, శ్రీకృష్ణ భక్తులు ,నరసింహ స్వామి భక్తులు ,తదితరులు పాల్గొన్నారు

Leave a Reply